పెన్ను గన్ను - బాల గేయం -ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
గన్ను వంటిదే పెన్నూ 
అది తెలుసుకోరా చిన్నూ !

అ ఆ ఇ ఈ వ్రాస్తుంది 
అక్షర సమరం చేస్తుంది 
అన్యాయాలు ఎక్కడున్నా 
అందరికి అదే తెలుపుతుంది!

పేదను ధనికుల చేస్తుంది 
పెద్ద జ్ఞానమే ఇస్తుంది 
అనుకున్న పని సాధన లో 
అండగా మనకి ఉంటుంది!!


కామెంట్‌లు