పిల్లి పిల్ల మల్లెపూలు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
పిల్లి పిల్ల వచ్చింది
మల్లె పూలు తెచ్చింది
చిట్టి పాప చూసింది
పూల బుట్ట తెచ్చింది

బుట్టలో పూలు పోసింది
మ్యావుమని అరిచింది
తల్లి పిల్లి వచ్చింది
బిడ్డకు పాలు ఇచ్చింది

బొజ్జ నిండ తాగింది
బుజ్జి వద్దకు చేరింది
మచ్చిక తో ఆడింది
ఆటలో అలసిపోయింది

పీట కింద దూరింది
హాయిగ నిద్రపోయింది
బుజ్జి పాప లేచింది
అమ్మ ఒడిలో బజ్జుంది


కామెంట్‌లు