పక్కమీదినుండి
ప్రొద్దున్నే లేస్తా ..
వెంటనే కాలకృత్యాలు
తీర్చేసుకుంటా ....!
చక్కని పాపిటతో
తలదువ్వించుకుంటా ,
రెండుపిలకల జడను
వేయించుకుంటా ..!
తల దువ్వుకోకుంటే
మాతాతకు కోపం ...
ఆడపిల్లల జుట్టు
నిగనిగలాడాలట నిత్యం !
ఒత్తయిన జుట్టుతో
అందమైన జడలతో
అనందంగా ఉండాలట
ఆడపిల్లలెప్పుడూ ...మా,
తాతమాటతోనే ...నేను
ఏకీభవిస్తాను ఇప్పుడు!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి