ఆకాశాన్నంటే బహుళంతస్తుల భవనాలు
ఆప్యాయంగా పలుకరించుకోనిజీవితాలు
ప్రక్కనున్నా పట్టించుకోనీమని బ్రతుకులు
ఒకేనీడనున్నా కలువలేని ఉరుకులపరుగులు
సంపాదనకోసం క్షణం తీరికలేని ఉద్యోగాలు
అన్ని వసతులున్నా మరింకేదో లోటు
చేతినిండా డబ్బున్నా యింకా ఆశలు
తినడానికన్నీఉన్నా తినలేని పరిస్థితులు
పట్టుపరుపులున్నా నిద్రలేమి తో బాధలు
ఇంకా యెదగాలన్న స్వార్థపు ఆలోచనలు
తీసుకున్నావిక ఒక మంచినిర్ణయాన్ని
పలికావిక స్వస్తి కృత్రిమమైన జీవితానికి
వదిలేసావిక రణగొణధ్వనుల పట్టణాన్ని
తెలుసుకున్నావిక పల్లెజీవితానందాన్ని
కనుగొన్నావిక తల్లిదండ్రుల అనురాగాన్ని
తలచావిక ప్రియమైన చెలి ప్రణయాన్ని
తృప్తిగా బ్రతకడమే జీవితపరమార్థం
సంతోషంగానుండడమే నిజమైన ఆరోగ్యం
ఉపకారం చేయడమే మనిషికి సాఫల్యం
సర్వజనుల హితం కోరడమే కర్తవ్యం
పల్లె ప్రగతినాశించడమే భగవంతునికిష్టం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి