తోడు;-ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
మంచు గడ్డను గొంతు పిసికి రాతి గుండె కు అతికించి
మండుటెండల్లో మరిగించి రక్తంలో ముంచితే
పులి నాలుక చప్పరించినా చల్లని చలి కాలం అది!?

ప్రసవించిన హృదయం ఒళ్ళో పాప కళ్ళు తెరిచి
కొత్త లోకం కోసం శోకంలో మునిగిందేమో
పచ్చి బాలింతల మౌనంగా మాట గొంతును 
సరిచేసుకుని దిక్కుల్లో మూలుగుతుంది!?

చల్లని ఇనుప ముక్క పై సుత్తితో బాదుతున్నా బాధలో
మాంసపు ముద్ద ఎర్రని నిప్పుల్లో కాలుతుంది
ఎంత ఆపినా ఆరని మంటల్లో నీరులా నేతిని పోస్తున్నారు!?

తేనే కు బదులుగా పంచామృతం పంచుదాం అనుకుని
పంచదారను పావులుగా వాడుకుంటున్న 
పాపాత్ముల పండుగలా ఉంది అయ్యవార్ల ప్రవచనం !?

పాతాళం లోతుల్లో నవ్వుతున్నట్లు బాధల నిధులు ఒక్కొక్కటే బయట పడుతుంటే
ముల్లోకాలు ముక్కలు ముక్కలుగా చిట్లుతున్నవీ
పాత గతాల ఆత్మలను చెక్కుతున్న ఉలీ దిగినప్పుడల్లా
పిచ్చుక గుళ్ళు పెనుతుఫానులో చెదిరిపోతున్న ట్లు ఉన్నది!?

చూపులను కన్నవాళ్ళ కళ్ళు కన్నీళ్ళలో కొట్టుకుపోతుంటే
కంటిపాప నావలు ఆఖరి చూపులు దూర తీరాలకు ప్రయాణిస్తున్నాయి!?
పచ్చి బంగారాన్ని కరిగించి స్మృతుల మూసలో 
పోసి మనసుకు మతి లేకుండా మృతులను చేస్తే
ఆ పసిడి పసి పాప ఎలా అవుతుంది పాపాత్ములారా!?


మైకుల్లో గొంతులు పగిలినట్లు కంచును మ్రోగించీ
ప్రపంచానికి సమాచార పంచాంగం 
వినిపించిన దేవుడు మేలు కున్నట్లు లేదు
విచార కాంచనం మాత్రం దేవుని వల్లో వాళ్తూనే ఉంది 
పాలబుగ్గల గదుల్లో కాస్త తోడుతో పాలను పెరుగుగా మార్చవచ్చు కానీ
పాలను పగలగొట్టి పాడు చేస్తారు ఎందుకు పాపులారా!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273
కామెంట్‌లు