విన్నారా..విన్నారా...
ఈ వింత ను విన్నారా!!
విన్నారా..జనులారా ..
ఈ వింత..వింత..పోకడలు,
ఏ లిన వారు ఎంచుకున్న ,
గొప్ప నీతి సూత్రాలు...!
ఎన్నికల బరిలో నాయకుడు
రెండుచోట్ల పోటీ చేయు నట,
ఓ టరుకు మాత్రం రెండు-
ఓ ట్ల చాన్సు లేదట!
వింతల్లో వింత ఏమిటంటే
జైల్లో వున్న వ్యక్తి ఓటేయ రాదట,
నాయకుడు జైల్లో వున్నా...
ఎన్నికలో నిలవ వచ్చునట!
సర్కారు కొలువు కావాలంటే
డిగ్రీ కలిగి వుండాలట...
ప్రభుత్వం నడపడానికీ...
డిగ్రీ తో పనిలేదట...!
ఇదండీ మన వ్యవస్థ...
ఈ వ్యవస్థ మారకుంటే
తప్పదు మనకు అవస్థ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి