"మనుగడకే వెలుగులు"(బాలగేయం);--పోతుల చైతన్య భారతి
 దీపాలా వెలుగులు
సరదాలా నవ్వులు
రంగురంగు కాంతులు
రమ్యమైన జ్యోతులు
      వ్రతాలూ నోములు
      మధురమైన వంటలు
      టపాసుల సరదాలు
      స్నేహితుల సందడులు
దీపం స్వరూపము
పరబ్రహ్మ చేతనము
కార్తీకా మాసము
భక్తితో ఆనందము
     ప్రపంచాన వైరసులు
     మానవులకు కష్టాలు
     తొలగిపోవు బాధలు
     మనుగడకే వెలుగులుకామెంట్‌లు