ఊహాలోకం;-విజయ శ్రీ దుర్గ- కలం స్నేహం

 నిన్ను చుసింది ఓ రెప్పపాటే
ఏమి మాయ చేసావో ప్రియా 
నీరూపం బందించే నా మస్తిష్కంలో 
చుసి చూడగానే మనస్సుకేదో అయింది 
నా మనస్సుమాట వినకుంది  
నా మనస్సంతా  ఆనందమే  ఎందుకో 
ఈ అలజడి ఆనందంఎమిటి నాలో 
తలచిన వెంటనే వస్తున్నావు నాలోకి 
తలపులలోనే తాండవిస్తున్నావెందుకు 
నా  తలపుల్లోనే జీవిస్తావా కలకాలం 
నీతోటెనేనని అనుక్షణం ఊహాలోకంలో
విహరిస్తున్నా 
ప్రేమిస్తున్నాఅణువణువునీ ప్రేయసిగా 
శ్వాసిస్తున్నా నీ ఊపిరిలో ఊపిరినై 
నాప్రయాణంపయనం నీతోటె ప్రియా
నాగమ్యం గమనం ప్రతిఅడుగు నీతోటె
నీవే నాకు లోకమని నా సొంతమని 
నిన్ను చూశాక నన్ను నేనె మరిచాను
మనస్సుఆరాట ఉబలాటల పొరాటమే  
ఊహల్లోనే విహారిస్తావా ప్రియసఖుడా 
తలపుల్లోకాకనాకోసమై తరలి రాలేవా 
నువ్వు నా  సొంతమైతే చాలులే ప్రియా  
వెయ్యిజన్మలకైనా నీ రాకకై నిరీక్షిస్తా

కామెంట్‌లు