బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 181) ధీరులైనవారు న్యాయమార్గాన్ని తప్పరు.
182) ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఉన్న వ్యక్తులు పదిమంది ఉంటే ప్రపంచాన్ని ఉర్రూతలూగించవచ్చు.
183) అంతరాత్మకూ, మనోభావాలకూ వైషమ్యం సంభవిస్తే ఆంతరంగిక ప్రేరణం అవలంబించు.
184) అంతర్నిహితమైన అనంతశక్తిని వ్యక్తం చేయడానికి శక్తికొద్దీ ప్రయత్నించకపోవడమే అపజయం.
185) ఆత్మవిశ్వాసం లేకపోవడమే మరణం.
(సశేషము)

కామెంట్‌లు