నీరజాక్షుడు-సంధ్యా శ్రీనివాస్-కలం స్నేహం.
నగుమోముతో గోపికల మది దోచెను మాధవుడు
నల్లని వాడు పద్మ నయంబులతో
కృపారసాన్ని ఒలకబోస్తున్నాడు తన భక్తులపై
నీలిమేఘ ఛాయ వర్ణంతో యశోదమ్మ గారాల తనయుడై యుండె రేపల్లె లోన

నీరజాక్షుడిని అష్ట సతులు, పదియారు వేల మంది గోపకాంతలు సదా తనను స్మరిస్తున్నా
నవనీతచోరుని మనసు దోచినది రాధమ్మే  కదా

నవ మోహనాంగుని  వేణువు సవ్వడి విని పశు పక్ష్యాదులు సైతం మైమరిచి పోతాయి కదా
నల్లని ఆ కన్నయ్య వెన్నదొంగయై గోపకాంతల జన్మ తరింపజేసెను కదా
నారాయణుడి మైత్రి పొందిన సుదాముడు పూర్వ జన్మలో ఏ నోము నోచెనో కదా

నంద యశోదలు ఏ బంగారు పూలతో పూజ చేసారో
నీరజాక్షునికి తల్లిదండ్రులయ్యే భాగ్యం కలిగింది
నగుమోము కృష్ణయ్య తో కలిసి మెలిసి ఆడుకున్న గోప బాలురది ఎంత భాగ్యమో
నల్లనయ్యగా పేరుగాంచి రేపెల్లె వాసుల ఇక్కట్లు తొలగించెను కదా


కామెంట్‌లు