తరువులు తమకంటూ ఏమీ
దాచుకోకుండా పరోపకారియై జీవిస్తూ
అపకారికి సైతం ఉపకారం చేస్తూ
నిస్వార్థ జీవనం కొనసాగిస్తూ
చిన్న మొక్క సైతం జీవులకు
ఎన్నో రకాలుగా పనికొస్తూ
మనుషుల ఆకలి తీరుస్తూ
జంతువుల మేతకు పనికొస్తూ
విరబూసిన పూలు చూసేవారికి
ఆహ్లాదాన్నందిస్తూ
పూల పరిమళం దూరంగా ఉన్నవారికి
సైతం ఆనందాన్నిస్తూ
జనులందరికీ ఎంతో మేలుచేసేలా జీవిస్తూ
మహావృక్షమై ఎందరికో నీడనందిస్తూ
బాటసారులకు నీడనిచ్చి సేదదీరుస్తూ
గృహానికి అవసరమయ్యే కలప సామాగ్రినందిస్తూ
గృహావసరాలకు వివిధ రూపాల్లో
ఇమిడి అందాన్ని, సౌకర్యాన్నిస్తూ
విలువైన కలపనందించి మనుషులను
కుబేరులను చేస్తూ
ఎన్నని ఉపయోగాలు వృక్షాలు మనకందిస్తూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి