నీ పైనే నా ధ్యాస-కళావతి కందగట్ల-కలం స్నేహం
నెలతప్పిన నాటినుండి
నీ పైనే నా ధ్యాస
నెలనెలా ఎదుగుతుంటే
నీ ఊపిరి అయ్యింది నా శ్వాస

నీ రూపు తెలియకున్నా
కన్నా...
నా కలల నిండా నీ ముద్దు మోమే..
నే శుష్కించినా వేవిళ్లతో
నా మస్తిష్కమ్ నిండా
నీ తలపులే...

నాకు సహించని రుచించని ఆహారమైనా
నా ప్రతీ ముద్దా
నీకందాలని...నీవు ఎదగాలనే
నా తపత్రయం...

 నీ అవయవాల కదలికలకు
 నాలో తెలియని పరవశం 
 నీ కాలి ముద్రలకు
 నా మది చేసింది ఆనంద
 తాండవం....

నెలలు నిండిన నా గర్భం పెరుగుతున్న 
నీ రూపం  మోయలేని భారమైనా
తల్లిని కాబోతున్నాననే గర్వం
నాలో....

నా చిట్టి తండ్రీ! నీ రాక...
నాలో కణం కణం కదిలించినా
నరం నరం మెలిబెట్టినా
నిను నా గుండెలకు హత్తుకున్న
క్షణం....
నా పంటి బగువు వేదనలన్నీ మాటుమయం....
నా మనసంతా సంతోష సాగరం


కామెంట్‌లు