శ్రీలక్ష్మి హారతి;- త్రిపురారి పద్మజనగామ.
 పల్లవి::
మంకెన పువ్వులన్నీ
నీ మేను చేరినట్టు
అరుణ వర్ణ చీరకట్టి
నా మదిని చేరినావు.
             "మంకెన"
చరణం::
మా ఇంటి మహలక్ష్మి
సిరులనొసగు శ్రీలక్ష్మి
కర్పూర హారతిదే
భక్తి సుమ హారమిదే.
            "మంకెన"
చరణం::
పసిడి కాంతి నీవమ్మా
సింధూర శోభినీ!
వరములివ్వ రావమ్మా
దరహాస హాసినీ!
             "మంకెన"
చరణం::
నీకంటి చలువ చూపు
ఇంటింట దీపమాయె
మీనాక్షి రావమ్మా!
రత్న దీప్తి నీవమ్మా!
     
            "మంకెన"
చరణం::
ఘల్లుమన్న మువ్వలన్నీ
జల్లుగా కురిసెనమ్మా
వెల్లువంటి నీ కరుణ
మమ్ము చేర వచ్చెనమ్మా.
           "మంకెన"
       

కామెంట్‌లు