నగముల రేగిన నల్లని కాంతే నిగనిగ మెరుపులు పుడమితల్లికి
నాకములిచ్చటి నల్లరేగడులు నాగలిపట్టిన మణిమయ మకుటము....
నింగి దిగిన నెలవంకవు నీవే నిప్పులగుండాన్నెద దాచినవు
నీలి సంద్రపు సలిలములవనికి నయనములద్దిన కాటుకరేఖలు....
నుడికారములే సింధునేమికి నింగిన నిండిన నీరదాలుగా
నూపుర ధరణికి వినీల విపినపు నీలినీడగా నీహారికలు...
నృపుడే నభమై నవ్యయుగముల నర్తన మాడే మధూళికలుగా
నెమలిఆటలు మేఘనాదాలు వసుధగర్భ వదనపు నెప్పరములు.....
నేర్పరి గంధహారిణియై నైరాష్యంనెమర్చే నైపుణ్యాలు
నొసటి కుంకుమతిలకము దిద్దే నిశ్చల నిలీన హిమవన్నగము..
నైవేద్యములే ఇలజనులకు వసంతాల నవనవోన్మేషములు
నోములపంటై వనరాణుల కోకిల కబుర్లు మల్లియగుబుర్లు...
నౌకాయనమే నేవళ నేలన ఆమని ఋతువులు మావిచిగుర్లు
నవ్వే నిండు పూగొమ్మల నిలుపు నవ్య వసుధనీ పరిరక్ష నిమిత్తం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి