బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 191) బలిష్ఠులనూ,మేధానిధులనూ రూపొందించే జాతీయ విశ్వవిద్యాలయాలు స్థాపించబడాలి.
192) త్యాగం,సేవ ఇవే మహోత్తమ ఆదర్శాలు అని భారతీయులు గుర్తించాలి.
193) అంతఃకలహాలను పోగొట్టి, జనంలో ఐకమత్యాన్ని పెంపొందింపజేయాలి.
194) సనాతనధర్మ తత్వాలను పాశ్చాత్యులకు బోధించడానికి, వారి సాంకేతిక విద్యలను మనం నేర్వడానికీ మనయువకులకు తగిన శిక్షణ కల్పించాలి.
195) తత్త్వబోధలకు ముందు అన్నపానాలను సమకూర్చి జనసామాన్యముయొక్క స్థితిని మెరుగుపరచాలి.ఇందుకోసం జనంలో విద్యావ్యాప్తి చేయడం ఎంతో అవసరం.
(సశేషము)
*



కామెంట్‌లు