అల ,కల , తొలి , చెలి పదాలతో దత్తపది;- సాహితీసింధు సరళగున్నాల

 చం*అలకల కాపురమ్మునది అందనిద్రాక్షగసౌఖ్యమంతయున్
కలతల మధ్యలోనిలిచి క్రమ్మగ చీకటి నీలినీడలున్
తొలి వలపన్నయూసు నతి దూరముజారుచుబాధదక్క నా
చెలిమది కృంగిపోవ నతి చింతయె దక్కును శాంతివీడునే
కామెంట్‌లు