అనుభవం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం కొత్త చోటు కెళ్ళినపుడు ఇబ్బంది పడతాం.ముఖ్యంగా బంధువులు మిత్రుల ఇంట్లో ఒక రాత్రి ఉంటే  త్వరగా నిద్ర పట్టదు.తెల్లారినా అంతా కొత్తగా అనిపిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు  త్వరగా కొత్త చోటు కి వెళ్లటానికి ఇష్టపడరు.ఒకప్పుడు  సముద్రతీరంలో జాలయ్య అనే బెస్తవాడు భార్య తో హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు.అతని ఇద్దరు కూతుళ్లు పెళ్ళీడుకి రాగానే తగిన సంబంధాలు చూసి వివాహాలు చేశాడు. పెద్ద కూతురు పెద్దమ్మ  కి ఓసామాన్య కుర్రాడితో పెళ్లి ఐంది.రెండో కూతురు పొన్నమ్మ కాస్త డబ్బు చదువు ఉన్న కుర్రాడి తో హాయిగా  కాపురం చేస్తోంది. ఒక సారి వారిద్దరి కాపురాలు ఎలా ఉన్నాయో చూడాలని జాలయ్య  ముందు  పద్దమ్మ ఇంటికి వెళ్లాడు.బీదగా సాదాసీదాగా ఉన్నా కూతురు సంతోషంగా ఉండటంతో ఆనందించాడు.కమ్మగా వండి వార్చింది.ఒక నాల్గు రోజులు ఉండి పొన్నమ్మ ఇంటి కి వెళ్ళాడు. అందమైన భవంతి సామానుతో ఉన్న ఆఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు.స్నానం చేసి న అతను కమ్మని పరిమళం వెదజల్లే పౌడర్ ని ఒంటి నిండా పులుముకున్నాడు.డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కాళ్ళు రెండు పైన ముడుచుకుని  కూచుని పాయసం తిన్నాడు.ఖీర్ రుచి గా ఉండటంతో బాగా తినేశాడు. ఆపై ఆపసోపాలతో  బాధపడ్డాడు.ఆతరువాత  మెత్తటి పరుపు  దోమ తెరమంచంలో పడుకున్నా
దోమలు లోపల దూరి సతాయిస్తుంటే తెల్లవార్లూ తోలుతూ కూచున్న అతనికి  గాఢనిద్ర పట్టింది.హఠాత్తుగా లారీల ట్రక్కుల మోతతో  ఉలిక్కిపడి పక్కకి దొర్లాడు.తన ఇంట్లో  చాపపై పడుకునే అలవాటు ఉన్న  అతను మంచం మీద నుంచి ఢాంఅని  కింద పడ్డాడు. అంతే కూతురు అల్లుడు పరుగెత్తుకొని వచ్చి లేపారు.నడ్డి నెప్పితో రెండు రోజులు బాధపడ్డాడు."అమ్మా!నాకు అంబలి ఇవ్వు. ఆ నల్ల కషాయం వద్దు "అని కాఫీ గ్లాస్ ని పక్కన పెట్టాడు. "నేను మన ఊరు వెళ్తాను.అమ్మ ఒక్కతే ఉంది "అని బైలుదేరాడు. తన ఇల్లు చేరిన జాలయ్య ను అడిగింది భార్య "ఏమయ్యా!బిడ్డలు బాగున్నారా?" "ఆ! మన పద్దమ్మ  చాలా అదృష్టవంతురాలు.మనలాగే పూరిగుడిసె.గంజి వేడిబువ్వ చేపల వంటలు  బాగున్నాయి. పొన్నమ్మ ఇల్లు  వంటలు అస్సలు బాగా లేవు.పొట్టగడబిడ  మంచం పైనించి కింద పడి నడ్డి విరిగింది."భర్త మాటలకు విస్తుబోయింది చెంచమ్మ.
కామెంట్‌లు