బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 186) జ్ఞానం, భక్తి, శక్తి ఇవి సహజంగా ప్రతి జీవిలోనూఉన్నాయని గ్రహించండి. ఇవి వ్యక్తం కావడంలోని తారతమ్యమేజీవుడిని అధికుడుగానో,అల్పుడుగానో చేస్తాయి.
187) పరమేశ్వరుడికీ మనకీ మధ్య ఉన్న మాయా యవనిక తొలగగానే ప్రకృతి మనకు దాస్యమవుతుంది. అప్పుడు మనం ఏం సంకల్పించినా అది జరిగితీరుతుంది.
188) సన్యాసుల విషయంలో ప్రతీకారం నేను ఆమోదించను.కాని ఆత్మసంరక్షణ అనేది గృహస్త ధర్మం.
189) మీ భావాలను, ఆశయాలను,ఆచారాలను సమస్తం భారతీయంగా, హైందవ సంప్రదాయానుగుణంగా చేసుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి.మీ బాహ్యాంతరంగిక జీవనమంతా సనాతన ధార్మిక జీవనాన్ని అనుగమించాలి.ఇదే మీకు ఆదర్శం.
190) దేశంలో తగురీతిలో సంస్కృత విద్యావ్యాప్తి జరగాలి.
(సశేషము)


కామెంట్‌లు