సీస పద్యం
చిత్రము జూడక చిత్రమాయెనుగద
ప్రాణమున్నయపుడె భారమనగ,
మరణమొందిన తండ్రి మాన్యత గుర్తించె
పుత్రులున్న ధరణి పుణ్యభూమి ,
పితృ రూపము వలెను పీఠమ్ము జేయించె
మమతల తనయుడు మాన్యుడతడు ,
నట్టింట వేయించి నాన్నగా భావించి
ధ్యానించె తండ్రిని తనివిదీర .
తేటగీతి
పీఠ మందున కూర్చుని ప్రీతితోడ,
నాన్న యొడి లాగ భావించె నందనుండు ,
గుండె గుడినున్న ప్రేమను గుమ్మరించె ,
కర్మ ఫలితమ్ము లీరీతి కలియుగాన
చిత్రము జూడక చిత్రమాయెనుగద
ప్రాణమున్నయపుడె భారమనగ,
మరణమొందిన తండ్రి మాన్యత గుర్తించె
పుత్రులున్న ధరణి పుణ్యభూమి ,
పితృ రూపము వలెను పీఠమ్ము జేయించె
మమతల తనయుడు మాన్యుడతడు ,
నట్టింట వేయించి నాన్నగా భావించి
ధ్యానించె తండ్రిని తనివిదీర .
తేటగీతి
పీఠ మందున కూర్చుని ప్రీతితోడ,
నాన్న యొడి లాగ భావించె నందనుండు ,
గుండె గుడినున్న ప్రేమను గుమ్మరించె ,
కర్మ ఫలితమ్ము లీరీతి కలియుగాన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి