కీరాతో బాతు; డా:కందేపి రాణి ప్రసాద్

 పిల్లాలూ!ఎండాకాలం వచ్చేసింది కదా!మార్కెట్లో కీరాలు బాగా వచ్చేస్తున్నాయి.మరి కీరాతో బాతు చేద్దామా! ఈ బాతు కోసం ఉపయోగించినవన్నీ పచ్చికూరగాయల సలాడ్ కుపయోగించే కురగాయలే. కాబట్టి బాతును చూసి ముచ్చట పడినంత సేపు ముచ్చటపడి ఆ తరువాత అలాగే తినేయవచ్చు.అయ్యో! దానికి గుచ్చిన పిన్నులు తీసే సుమా!మరి ముందు బాతును చేద్దామా!
ఓ చిన్నసైజు కీరా, ఒక దొండకాయ, ఒక క్యారెట్ ఉంటే చాలు బాతు తయారైపోతుంది.కిరాను శరీరం వలె దొండకాయను మెడ తల వలె అనుకోని ఆ ఆకారంలో పెట్టుకొని పిన్ చేయాలి.బాతు ముక్కు కొరకు క్యారెట్ ముక్కను దొండకాయకు గుచ్చాలి.కన్ను కొరకు విత్తనాన్ని ఉపయోగించాలి.పుచ్చకాయ విత్తనం కన్ను ఆకారంలో ఉంటుంది.అందుకే అది ఉపయోగించాలి.తోక కోసం కూడా క్యారెట్ ను పెట్టాలి.కాళ్ళ కొరకు కూడా క్యారెట్ పెట్టాలి.
క్యారెట్ ను సన్నని ముక్కలుగా కత్తిరించుకొని,చివర్లు చిలికలుగా కత్తిరించి, పాదాలు పల్చగా ,మడమలు  ఎత్తుగా కత్తిరించుకుంటే బాతు కాళ్ళమీద నిలబడుతుంది.ఇలా కాళ్ళమీద నిలబడితేనే అందంగా ఉంటుంది.బుడి బుడి నడకలతో ,క్యాక్, క్యాక్ అంటూ అరుస్తూ పోతున్న బాతు తయారైంది.బావుందా! మరి పట్టుకొని  టేబుల్ పై అలంకరింప చేయండి.
కామెంట్‌లు