: ఓ వాన దేవుడా--సంధ్యా కుమారి-కలం స్నేహం
ఆకాశం మేఘావృతమై వుంది
అది పిల్ల తెమ్మెరలా మదిని తాకి
స్వాంతన చేకూరుస్తుందనుకుంటే 
పెను ముప్పయ్యింది

వెలిగించిన కార్తీక దీపాలు
చంద్రకాంతుల వలె 
మెరుస్తాయనుకుంటే
వరదొచ్చి నీటి రాక్షసి వలె
దీపాలను ముంచేసింది

భక్తునికి దేవునికి అనుసంధాన 
కర్తయిన గోవు లాంటి పూజారిని 
పెద్దపులిలా ఎత్తుకుపోయింది

ఈ వరద పోటు సామాన్యునిపై
బ్రహ్మాస్త్రం వలె సంధించబడింది

తిరుమల శ్రీనివాస నివాసాన్ని 
ఉగ్రశేషు పాన్పులా చుట్టేసింది,
వాగులు వంకలు పొంగాయి
కరకట్టలు తెగాయి
జన జీవనం కకావికలమైంది

వరదలో మునిగిన గ్రామాలు
నీటి ఎడారులను తలపిస్తున్నాయి,
జల దిగ్భంధంలో చిక్కుకున్న
ప్రజలను కాపాడుటకు 
రంగంలోకి దిగారు 
దైవ రక్షకుల్లాంటి 
సైనిక సిబ్చంది

బందిపోటు దొంగలా 
దండెత్తి వచ్చిన వానదేవుడా
తగ్గవయ్యా శాంతి కాముకుడిలా

కామెంట్‌లు
రాము కోలా.ఖమ్మం చెప్పారు…
మనిషి దైవం సృష్టించిన ప్రకృతిని పరిశీలిస్తూ,తన అవసరాలకోసం,విలాసాలకోసం, దురాక్రమణ చేస్తూ,మనిషిని సృష్టించిన మహనీయునికే ఇక్కట్లు కల్పిస్తున్నారు మానవుడు.అనిపిస్తుంది వరదలను చూస్తూ..