స్పూర్తిని నేను;-తొగర్ల సురేష్-కవి,రచయిత-ఫ్రెండ్లీ పోలీస్-నిజామాబాద్.
 భారతమాత ముద్దుబిడ్డను
భావితరాలకు స్పూర్తి ప్రదాతను 
అల్లూరి ఆవేశం నాది
భగత్ సింగ్ పౌరుషం నాది
నేతాజీ క్రమశిక్షణ నాది
ప్రకాశం గాంభీర్యం నాది
బ్రహ్మన్న సింహపు చూపు నాది
శివాజీ చైతన్యం నాది
గానకోకిల గొంతు నాది
కృష్ణదేవరాయల కీర్తి నాది
తిమ్మ రుసు యుక్తి నాది
ఆజాద్ పోరాటం నాది
వివేకానందుని ఖ్యాతి నాది
పృథ్విరాజ్ చౌహన్ శూరత్వం నాది
పురుషోత్తముని విరత్వము నాది
అంబేద్కర్ ఆశయం నాది
శాస్త్ర పోరాటం నాది
అశోకుని ధర్మచక్రం నాది
చాణక్యుడి వివేకం నాది
భిన్నత్వంలో ఏకత్వం నాదేశం
వీర నారీమణులకు పురిటిగడ్డ నాదేశం
శాంతికి నిలయం నాదేశం
మహాత్ముడిని కన్న నా భారతదేశం
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన వారిని
సముద్రాలు దాటించిన ఘనత నాది
మన జాతి సొభగులు వీరు
భరతమాత కంఠసీమలో
రత్నాల మణిపూసలు వీరు
ఎవరో చెబితే వచ్చిందికాదు నా దేశభక్తి
అమ్మ ఉగ్గుపాలతో అబ్బoది నా దేశభక్తి
అస్తికలు గంగలో కలిపిన
 ఉప్పెనలా ఎగిసిపడుతూ
భారతమాతకు జై అంటాయి

కామెంట్‌లు