6. ' కుసుమ కోమల విన్నపం’
ఈశ్వరా, నేను ఒక 'పుష్పాన్ని'. ఆలస్యం చెయ్యకుండా ఈ చిన్ని పువ్వును కోసుకో స్వామీ... అలా జరగకపోతే వాడిపోయి మట్టిపాలై పోతానని భయంగా వుంది. నీ కంఠ సీమను అలంకరించే భాగ్యానికి నేను నోచుకోలేదు. నీగోరు తగిలి బాధ కలిగినా పరవాలేదు, ఈ చిన్ని పువ్వుకు కాలం చెల్లిపోవచ్చు, పుష్పాలను అందుకునే నీ పూజాసమయం దాటిపోతుందేమో!... నాకు గొప్ప వాసన, అందమైన రంగు లేకపోవచ్చు....సరైన తరుణంలో నన్ను చేకొని నీ సేవాభాగ్యాన్ని నాకు కల్పించి నన్ను తరింపజేయి ప్రభూ...
గీతాంజలి -- రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి