డాక్టర్స్... డైరీ ..!!>ఒక్కసారి తప్పుచేస్తే ..!!; డా.మల్లీశ్వరి.చుండూరి.>భీమవరం (ప.గో.జి)
 ఇది పెషెంట్స్ నిర్లక్ష్యమో 'తెలివిలేని తనమో '
'అవగాహనా లోపమో తెలియటం లేదు '
ఈ పెషెంట్ జూన్ లో తొమ్మిదవనెల గర్బిణిలో 'కోవిద్ 'వచ్చింది .
నా దగ్గర కోవిద్ కేసెస్ కి పర్మిషన్ లేదు కాబట్టి విజయవాడ పంపించా అక్కడ చాల సిరియస్ అయి వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడి 'ఆపరేషన్ ద్వరా బిడ్డకు జన్మ ఇచ్చింది! '
పదిరోజుల క్రిందట వాంతులు అని వచ్చింది .
చూస్తే పదునాలుగువారాల గర్భిణి !
 అప్పటికి ఆపరేషన్ అయి ఐదునెలలు గర్భిణి (14 వారాలు ')
ఈ టైం లో అబార్షన్ కష్టమే !'అలా అని గర్భిణి కంటిన్యూ చెయ్యటం కుడా కష్టమే !
"ఏదో ఒక్కరోజు కలిసాం అంతే అమ్మ'ఇలా జరిగింది 
మీరే ఎదో ఒకటి చెయ్యండి" అంటారు .
మాములుగా గర్భ సంచి 'చిన్న దానిమ్మ పండు' అంత ఉంటుంది నెలలు నిండాక దాని సైజ్ ఐదు కేజీల 'గుమ్మడికాయ 'అంత సైజుఅవుతుంది. మూడుకేజీల బిడ్డ,ఒక కేజీ మాయ ( ప్లాసెంటా)
కొద్దిగా ఉమ్మినీరు !
ఆపరేషన్ అయ్యాక గర్భసంచి మీద కోత  ఆరటానికి /బలపడటానికి కనీసం 'ఒక సంవత్సరం నుండి సంవత్సరం నర' పడుతుంది .
కోత ఆరకుండా గర్భిణి వొస్తే ,బిడ్డ ఎదుగుదల తగ్గటం 
మాయ కుట్లకు అతుక్కోవటం ,
నెలలు నిండాక' కుట్లు విడిపొవటం జరుగుతుంది .
ఒక డెలివెరి లో కనీసం 750ml  రక్తం పోతుంది '
తిరిగి ఆ రక్తం పొందటానికీ టైం ఇవ్వాలి .
డెలివరీ అయ్యాక ,ఒంట్లొ ఉన్న' ఐరన్' 'కాల్షియమ్' మిగతా విటమిన్స్ /మినరల్స్ /అన్ని అడుగంటుతాయి .
అవి అన్ని శరీరంలోకి చేరటానికి టైం ఇవ్వాలి .
డెలివరీ అయ్యక నెలసరులు మొదలు కాకపొతే గర్భిణి వొచ్చే అవకాశం లేదు అని అనుకుంటారు చాలమంది !
అప్పుడు కుడా గర్భిణి వచ్చే అవకాశాలు ఉన్నయి! '
ఆపరేషన్ అయినా 'నార్మల్ డెలివరీ 'అయినా ఐదవ నెలలో వచ్చి ' కాపర్-టి' వేయించుకోవటమో, లేదా 'కాంట్రాసెప్టివ్ పిల్స్' వాడటమో చెయ్యాలి '
మీరు ఒక్కసారి చేసిన తప్పుకి ముగ్గురు డేంజర్ లొకి నెట్టబడతారు.ఒకటి తల్లి, రెండునెలల బిడ్డ ,
మూడూ ''కడుపులోని బిడ్డ ''!!
                     తస్మాత్ జాగ్రత్త
                      ************

కామెంట్‌లు