దీపావళి ;-భరద్వాజరావినూతల(RB)

 281) నరకసంహారంతో వచ్చిన పండగ 
తెచ్చింది ఆనందాలు నిండుగా 
చిన్నాపెద్దా బేధం మరచిపోతారు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
282)ఆశ్వీయుజమాసాన వచ్చేటి  పండుగ 
వెలుగుదివ్వెల నింపేటి పండుగ 
 చేస్తుంది జగతిని జాగృతం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
283)మనఆశల్లా వెలిగే మతాబాలు 
అహంకారానికి ప్రతీకలైన ఔట్లు 
దోమలతోలేందుకు కాల్చే వెన్నముద్దలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
284)దీపాలను పూజించే పండగ 
ఆకాశదీపాలు వెలిగిస్తారు భక్తిగా 
తోలుతారు మనసున చీకట్లు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
285)హిందువులకు ముఖ్యమైన దినం 
మహిళామతల్లి శక్తికి నిదర్శనం 
అందాలకాంతులతో ఇస్తుంది దర్శనం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************

కామెంట్‌లు