"ప్రముఖసినీనేపథ్య గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు జయంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
రత్నమాంబగర్భరత్నమై జన్మించి
గానలీలలెన్నొఘనముగాను
చూపినాడు,నిండుశోభాయముగనిల్చి
ఘంటసాలగొప్పఖ్యాతివడసె!!!

02.
 ఆ.వె.
గళమునందుతేనెగలగలప్రవహించి
పాటపాడినపుడుప్రాణమంత
పులకరించుగాదెనిలలోనిజనులకు
మేటిగాయకుండుమెప్పులొందె!!!

03.
 ఆ.వె.
చిత్రసీమయందుచిరయశస్సునుపొంది
పలువిధాలపాడెపాటలెన్నొ
అతనిగానగరిమయందాలహరివిల్లు
మదికినింపుగొలుపుపదిలముగను!!!

04.
ఆ.వె.
"శేషశైలవాసశ్రీవేంకటేశుని"
"భక్తిమీరపాడిముక్తినొందె"
"గానచక్రవర్తికమనీయరమణీయ"
"బాణిలెన్నొకూర్చెప్రతిభతోడ"!!!

05.
ఆ.వె.
కంచుకంఠమతనికాభరణంబాయె
భారతాంబకరుణభవ్యముగను
పొందినట్టిఘనుడుపూర్ణుండుపాటల,
పూజఫలమునొందెపుణ్యశాలి!!!

06.
 ఆ.వె.
తేనెకన్నమిన్నతీయనికంఠము
ఘంటసాలవారిగానసరణి
పాటవిన్నచాలుపరవశంబునుగల్గి
మనసుకుదుటపడునుమనకునెపుడు!!!

07.
 తే.గీ.
ఘంటసాలనుమించినగాయకుండు
లేడు,నతనికిసాటియులేడుభువిని
భక్తిగీతాలనెన్నియోపాడినట్టి
మధురగాయకస్వరమూర్తిమదినిదలుతు!!!

08.
తే.గీ.
అతని "గీత"నువిన్నచో హితముగల్గు
గానగంధర్వసారథికమ్రమొప్ప
పాటలుర్రూతలూగించిపరమపదము
చేరుకునెతానుసద్గుణశీలియతడు!!!

09.
కం.
"సంగీతసార్వభౌముడు"
"మంగళకరగానములనుమనకందించెన్"
"పొంగించియుగానసుధలు"
"మంగళవాయిద్యములనుమరిమ్రోగించెన్"!!!
కామెంట్‌లు