:సహకారం(65);-శిరీష వూటూరిహైదరాబాద్సెల్ నెంబర్:8008811669
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితంబు
రూపకర్త:నెల్లుట్ల సునీత గారు
=====================
1.అమ్మకుచేయాలి నాన్న సహకారం
నాన్నకుఅమ్మ చేయాలి సహకారం
అపుడేఅవుతాయి కలలు సాకారం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

2.ఉద్యోగులకు అధికారి సహకారం
అందిస్తేపనులు అవుతాయి వేగిరం
సంస్థబాగుంటే నిండుతుంది ధాన్యాగారం
చూడచక్కని తెలుగు సున్నితంబు

3.లేనివారికి అందించాలి సహకారం
ఉన్నవారికదే చూపిస్తుంది సన్మార్గం 
ధనికపేద తేడాలేని సమాజం
చూడచక్కని తెలుగు సున్నితంబు

4. మనిషిలో పెరిగిపోయింది స్వార్థం
కానరావట్లేదు మచ్చుకైనా సహకారం
పెంచుకుంటేనే పెరుగుతుంది మమకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు

5. ఏపనికైనా పెద్దల సహకారం
కోరడంలో తగ్గదు నీఅభిమానం
కొత్తవిషయాలు నేర్చుకోవడం ప్రారంభం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు