సాహితీబృందావన జాతీయవేదిక
ప్రక్రియ :సున్నితం
రూపకర్త :నెల్లుట్ల సునీతగారు
********************
1. కరుణగల్గిన మనసు సుందరం
ఆపదలో ఆదుకొనుట మానవధర్మం
సహకారం అందించు సమాజహితం
చూడచక్కని తెలుగు సున్నితంబు.
2. ఆత్మీయత అనురాగం అద్భుతవరం
ఉపకారం పదుగురికీ పధనిర్ధేశం
సమస్తలోక శుభకరం స్నేహభావం
చూడచక్కని తెలుగు సున్నితంబు.
3.సమిష్టికృషి మానవునికి అలంకారం
సకలజనులకు ప్రేమపంచుట మమకారం
వన్నెతరగని నిధికదా సహకారం
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
4. అసూయాద్వేషాలపై చూపు తిరస్కారం
సాటివారిపై చూపకెన్నడూ అధికారం
కూడుపెట్టదు ఎన్నడూ అహంకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు.
5. సద్భావన పెంచు సమున్నతవ్యక్తిత్వం
ప్రేమభావన వెలుగునిచ్చు కాంతిపుంజం
వేసంగిన మలయమారుతం ఆపన్నహస్తం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి