న్యాయం కోసం... ధర్మం కోసం
ప్రజలందరి శ్రేయం కోసం....
పోరాడిన యోధులందరూ...
దేశ ద్రోహులే... నియంతలకు !
చెడు నడతకు... మంచి కనపడు నా....వినపడు నా !?
కుతంత్రాలతోనైనా...కుట్రలెన్నో
చేసైనా... నేరస్తుల ముద్రవేసి
మరణ శిక్ష విధించెదరు... !!
శిలువ వేసి చంపినా....
తిరిగి తాను బ్రతికి వచ్చి....
దూషించిన వారిచేతే...
పూజింప బడుచుండెను !!
దేవుడన్న వేరెక్కడో ఉండ బోడు.... సోదరా... !
మనిషిగానే పుట్టుతాను...
మహాత్మునిగా బ్రతికి చూపు
పరమాత్మునిగా తానే...
పూజలందు నిది నిజము !!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి