సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం; --అనూరాధ మేరుగుహన్మకొండచరవాణి సంఖ్య:8247379020.
86. మీరు వెన్నెల వెలుగులతీరం
మీ ఉచ్ఛ్వాసం కవనం
మీ నిశ్వాసం శోకం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

87. సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలు
అమావాస్య చీకట్లాయె నేడు
అభ్యుదయం జాలువార్చు జావళీలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.

88. సామాజిక రుగ్మతపై అక్షరాస్త్రాలు
సంధించి చెండాడిన కలంయోధుడు
కుర్రకారుపై చిలిపిప్రేమలు చిలకరించినవాడు
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

89. మీసాహిత్యంలో ఉప్పొంగే జనహృదయాలు
ఝల్లుఝల్లున తూనీగల్లేతుళ్ళిన పదాలు
ఘళ్ళుఘళ్ళున మోగేమెరుపుల రవళులు
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

90. నింగికెగిసిన నిరుపమాన నిశిచంద్రుడు
నటరాజస్వామి జటాఝూటాన చేరెనేడు
తెలుగుభాష ఓలలాడిన సురగంగజలహోరు
చూడ చక్కని తెలుగు సున్నితంబు.


కామెంట్‌లు