*అభ్యుదయ భావాల రచయిత మన -డా.చిటికెన*;---మధుసూదన్ మామిడి,కరీంనగర్.సెల్ నం. 8309709642,9701195116.
 అభ్యుదయ భావాల ప్రముఖ రచయిత, సమీక్షకులు, వ్యాసకర్త, జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, సోషల్ అచీవర్, ఎడిటోరియల్ కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బేనోవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు డా. చిటికెన కిరణ్ కుమార్ గారి గురించి నావైన పదాలలో..
💠జననం💠
#కిరణ్ గారు తెలంగాణ రాష్ట్రం, #సిరిసిల్ల పట్టణ వాసులైన శ్రీ చిటికెన కనకయ్య శ్రీమతి ఉమ దంపతుల మొదటి సంతానంగా గారాల తనయుడిగా జన్మించారు.. తండ్రి గారు #వస్త్రవ్యాపారి.. మాజీ కౌన్సిలర్ మరియు రాజకీయ నాయకులు, సిరిసిల్ల "టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు"గా పనిచేసియున్నారు.. తల్లి గారు గృహిణి..
💠విద్యాభ్యాసం💠
#కిరణ్ గారి 1వ తరగతి జూనియర్ కాలేజీ చదువంతా #సిరిసిల్ల పట్టణములోనే గడిచింది.. #అగ్రహారం లోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేశారు.. తరువాత ఏం. కామ్ చదివారు..
💠వృత్తి💠
 ఎడిటోరియల్ కాలమిస్ట్ 
#కిరణ్ గారు డిగ్రీ చదువుచున్న రోజుల్లోనే #వస్త్రవ్యాపారం, ఉత్పత్తి గురించి ప్రత్యేక "ప్రాజెక్ట్ రిపోర్టు"ను తయారుచేసి కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల మెప్పుపొందారు..
   
💠అభిరుచులు💠
#కిరణ్ గారికి విభిన్న శైలిలో కవితలు, కథలు వ్రాయడం ఇష్టం.. #వ్యాసాలు, పుస్తకసమీక్షలు వ్రాయడమంటే చాలా ఇష్టం.. #ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో, శాంతి సమ్మేళనాలలో, #అంతర్జాల జూమ్ వేదికలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు..
💠కుటుంబ నేపథ్యం💠
#కిరణ్ గారు సిరిసిల్ల పట్టణానికే చెందిన #పల్లవి గారిని వివాహమాడారు.. వీరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం.. వీరికి రత్నాల్లాంటి ఇద్దరు కూతుళ్లు.. పేర్లు #సిరివదన, #హంసిక..
💠సాహితీప్రస్థానం💠
#కిరణ్ గారికి కాలేజీ చదివేరొజుల్లోనే చిన్న చిన్న కవితలు, వ్యాసాలు వ్రాసేవారు.. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలపై, జాతీయ నాయకులపై, మహాకవులపై కవితలు వ్రాసేవారు.. 
   #తరువాత అనతికాలంలోనే కవిగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ఎడిటోరియల్ కాలమిస్ట్ గా ఎదిగారు..
       #ఇంకా ATA, NATA, NATS అంతర్జాతీయ స్థాయి సాహిత్య పోటీలలో పాల్గొన్నారు.
       #ఇప్పటివరకు విభిన్న అంశాలపై 500కు పైగా కవితలు, వ్యాసాలు కథలు సమీక్షలు  వ్రాశారు..
  
 💠కథలు💠
📖 అనుబంధం (విశాలాక్షి మాసపత్రిక ప్రచురితమైంది)..
📖 రాధా అరవిందం (మల్లెతీగ మాసపత్రికలో ప్రచురితమైంది)..
📖 లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్  లాక్ డౌన్ (సంచికలో ప్రచురితమైంది)..
📖 మనసే మార్గం,
📖ఎర్ర సూరీడు (నేటినిజం దినపత్రికలో ప్రచురితమయ్యాయి)..
💠పుస్తక సమీక్షలు💠
📒 గడిపెళ్లి అశోక్ గారు వ్రాసిన "ఎంకటి కథలు" పుస్తకం..
📒 శ్రీమతి జ్యోతి రెడ్డి  వ్రాసిన "అయినా నేను ఓడిపోలేదు" పుస్తకం..
📒 జ్యోతి మువ్వల గారు వ్రాసిన "మువ్వల సవ్వడి" పుస్తకం..
📒 రొడ్డ సురేంద్ర గారు వ్రాసిన "నాన్న పచ్చి అబద్ధాల కోరు" పుస్తకం..
📒 బూర దేవానందం గారు వ్రాసిన "అక్షరం నా నేస్తం" పుస్తకం..
📒 ఉప్పల పద్మ గారు వ్రాసిన "వికసించిన ఆకాశం" పుస్తకం..
💠వ్యాసాలు💠
👉 వనిత నీకు వందనం..
👉 ఆన్లైన్ క్లాసుల తో పిల్లల దారెటు..
👉 చేనేతన్నకు పండుగ బతుకు..
👉 ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి సందర్భంగా "వీరనారీ నీకు వందనం"..
👉 స్వామి వివేకానందుడు స్ఫూర్తిదాయకం మొదలగునవి.. 
         #ఈ వ్యాసాలన్ని ఆదాబ్ హైదరాబాద్, వార్త, నమస్తే తెలంగాణ, మనం మొదలగు దినపత్రికలలో, మొలక న్యూస్ లో ప్రచురితమైనవి..
      #ఇవియే కాకుండా కిరణ్ గారు వ్రాసిన కవితలు పలు సాహితీసంస్థలు ముద్రించిన సంకనలాలలో ప్రచురితమైనవి..
💠బాధ్యతలు💠
ఇంటర్నేషనల్ బెనోవోలెన్ట్  రీసర్చ్ ఫౌండేషన్ వారి గౌరవ సభ్యుడిగా వున్నారు..
HWPL(హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రిస్టోరేషన్ ఆఫ్ లైట్) దక్షిణ కొరియా అంతర్జాతీయ సంస్థ  గౌరవ సబ్యూడిగా వున్నారు..
💠కీర్తిపురస్కారాలు💠
🥇2021 ఆగస్టు 28న  హైదరాబాద్ లో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా  "వే ఫౌండేషన" వారి ఆధ్వర్యంలో  లో మాజీ గవర్నర్, శ్రీ కొణిజెట్టి రోశయ్య గారి చేతుల మీదుగా  శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు భాష సేవ పురస్కారం-2021..
🎖️2021అక్టోబర్ 28న రోజున HWPL దక్షిణ కొరియా సంస్థ గౌరవ  సభ్యత్వాన్ని  మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారిచే హైదరాబాద్లో అందుకున్నారు..
🎗️🏆2021 అక్టోబరులో హైదరాబాద్ లో జలవిహార్ వేదికగా దసరా సమ్మేళనంలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిచే గౌరవ సన్మానాన్ని, సాంప్రదాయ మెమెంటో అందుకున్నారు..
🌸2021 నవంబర్ లో కేంద్ర మాజీ మంత్రివర్యులు, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సి.హెచ్.విద్యాసాగర్ రావు గారిచే  సత్కరించబట్టారు 

🔮2021 అక్టోబర్ లో  ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వేదికగా  ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో శ్రీలంక దేశ ప్రతినిధులచే "గ్లోబల్ హ్యూమన్  ఎక్స్ లెన్స్" అవార్డు అందుకున్నారు..
🥇పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కళా నిలయం  సాహిత్య సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి ( న్యూ ఢిల్లీ ) శ్రీ సముద్రాల వేణుగోపాలచారి గారి చేతుల మీదుగా డాక్టర్ సినారె సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు..
🎡తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వేదికగా.. "వే పౌండేషన్" తిరుపతి వారిచే వరల్డ్ అచీవర్- 2021 పురస్కారం..
🥇అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జి చంద్రయ్య గారి చేతులమీదుగా
2021 పురస్కారం.
👑 AK తెలుగు మీడియా ముంబై వారిచే "తెలంగాణ సాహిత్య రత్న"  బిరుదుపురస్కారం..
👑 సాహితీ బృందావన జాతీయ వేదిక,  తెలుగు భాషా పరిరక్షణ సమితి, భారతీయ భాష మంచ్.. న్యూఢిల్లీ గార్లచే  "కవి తేజ" బిరుదు పురస్కారం..
🥇సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం..
🥇నవభారత నిర్మాణ సంఘం వారిచే "శ్రీశ్రీ ప్రతిభా" పురస్కారం.
🎡 తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వేదికగా వరల్డ్ అచీవర్ ఫౌండేషన్ వారిచే వరల్డ్ అచీవర్స్ 2021 పురస్కారం.
🥇సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో కాళోజీ సాహితీ పురస్కారం-2021  అందుకున్నారు.
      #ఇవికాకుండా పలు సాహితీ సంస్థలచే 100కు పైగా సన్మానాలు, సత్కారాలు పొందారు..
💠చివరగా💠
సమాజ మార్పు కోసం అభ్యుదయ భావాలు కలిగిన   డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే     అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలు ఎన్నో  వరించాయి.. దక్షిణ కొరియా, శ్రీలంక  దేశాల సంస్థలచే  గౌరవ సభ్యత్వాలను అందుకున్న గొప్ప #సాహితీవేత్త..
ప్రతివ్యక్తి  సృష్టికి, మనుగడకు మూలం స్త్రీ అని భావించి, సమాజంలో ప్రధానంగా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను  తను వ్రాసే కవితలైతేనేమి, కథలైతేనేమి, వ్యాసలైతేనేమి అన్నింటిలోనూ తన భావాలను వినిపించిన వివాదరహిత #స్త్రీవాది..
#సృష్టిలో ఆడ మగ అనే వారే కాకుండా ట్రాన్స్ జెండర్ లు కూడా ఉన్నారని గుర్తించి వారి జీవితంలోని నరకవేదనలను తెలుసుకొని, ట్రాన్స్ జెండర్ లకు ఎందరికో ఆదర్శంగా నిలిచిన ట్రాన్స్ జెండర్ క్వీన్
మేకల హర్షిని  గురించి ప్రత్యేకంగా ఆర్టికల్ రాసి 
ట్రాన్స్ జెండర్ ల బాధలు తెలియజేసిన #ఉదాసీనుడు..
#కొరియాకు చెందిన HWPL ( హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్,  రిస్టోరేషన్ ఆఫ్ లైట్ ) వారి 7వ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రపంచ  శాంతి సమ్మేళనం సదస్సులో  పాల్గొని ప్రపంచ శాంతి గురించి, ఆక్రమణలు. దురాక్రమణలు, ఆధిపత్య భావజాలాలు, ఉగ్రవాదానికి పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో నీటిమీద రాతల్లా కనబడుతోంది, ఇది మారాలి.. ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలి.. యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం ఎదురు చూస్తోందంటూ తన సందేశాన్ని  తెలియజేసిన #భరతమాత ముద్దుబిడ్డ..
#జాతీయస్థాయిలో డాక్టర్ సినారె, శ్రీ శ్రీ,  పీవీ, కాళోజి, గిడుగు రామ్మూర్తి భాషా సేవ పురస్కారం, మాతృభాష దినోత్సవ సాహితీ పురస్కారం, ఇలా చెప్పుకుంటూ పోతే.. 
వివిధ సాహిత్య సంస్థల నుండి వందకుపైగా ప్రశంసా, పురస్కార పత్రాలు  అందుకోవడం  ఆతని సాహిత్య విజయ సౌరభానికి పరాకాష్ట..
#ఆత్మీయ సోదరులు డా.చిటికెన కిరణ్ కుమార్ గారు సాహిత్యంలో మరింత సేవ చేసి  తెలుగు భాషా గొప్పతనాన్ని ఖండతరాలలో చాటిచెప్పి భువన విజయమందుకోవాలని ఆశిస్తూ, అభినందనలు తెలియచేస్తూ.. మీ సోదరుడు


కామెంట్‌లు