సాహితీ బృందవన జాతీయ వేదిక
ప్రక్రియ::సున్నితంబు
రూపకర్త::శ్రీమతి ఎన్.సునీత గారు
--------------------------------------------------
316)
సిరివెన్నెల సిరివెన్నెల మాగుండెల
కారే కన్నీరు మా కన్నుల
నీవులేక సినీపరిశ్రమ వెలవెల
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
317)
నీపల్లవులు పన్నీరు చిలకించు
నీచరణాలు సత్యాలు పలికించు
నీపదాలు కచ్ఛపి వీణారాగాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
318)
నీగేయలు మానసిక ఔషధాలు
నీగీతాలు మనసుకుహాయి పూతలు
నీఅక్షరాలు కురుపించు అగ్నిదారలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
319)
నీపాటలు మందాకిని హొయల లయలు
నీమాటలు శత్రువులగుండెల్లో తూటాలు
నీరచనవ్యాసంగాలు చిత్రసీమకు అభంగాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
320)
నీవాక్పటిమ వాగ్దేవి ఆభరణాలు
నీపాటలు ఎప్పటికీ అమృతపానాలు
చిరస్మరణయాలు అజరామరాలు ఆపాతమధురాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
ప్రక్రియ::సున్నితంబు
రూపకర్త::శ్రీమతి ఎన్.సునీత గారు
--------------------------------------------------
316)
సిరివెన్నెల సిరివెన్నెల మాగుండెల
కారే కన్నీరు మా కన్నుల
నీవులేక సినీపరిశ్రమ వెలవెల
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
317)
నీపల్లవులు పన్నీరు చిలకించు
నీచరణాలు సత్యాలు పలికించు
నీపదాలు కచ్ఛపి వీణారాగాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
318)
నీగేయలు మానసిక ఔషధాలు
నీగీతాలు మనసుకుహాయి పూతలు
నీఅక్షరాలు కురుపించు అగ్నిదారలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
319)
నీపాటలు మందాకిని హొయల లయలు
నీమాటలు శత్రువులగుండెల్లో తూటాలు
నీరచనవ్యాసంగాలు చిత్రసీమకు అభంగాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
320)
నీవాక్పటిమ వాగ్దేవి ఆభరణాలు
నీపాటలు ఎప్పటికీ అమృతపానాలు
చిరస్మరణయాలు అజరామరాలు ఆపాతమధురాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి