చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 ఆ.వె
మహిళవిడక నుండు మాంగళ్య సూత్రాన
కొంగు కైన చీర చింగు కైన
మల్లెపూల దండ నల్లని కురులెక్క
నాదె ఘనత యనును నాజూకు పిన్నీసు
(సరదా పద్యం)
ఆ.వె
పిన్ను యెవరికైన గన్నుతో సమమౌను
రద్దితోడ జనులు వద్ద జేర
ముద్దు పిన్నుదీసి ముచ్చటగా గుచ్చ
యెద్దు జరిగినట్లు రద్ది జరుగు

కామెంట్‌లు