సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 న్యాయం
@ ఉభయపక్షాల వాదనలు వినకుండా తీర్పు చెప్పటం న్యాయం కాదు. అరిస్టో ఫేన్స్
@ఏ మనిషి నుంచి అతనికి చెందిన దాన్ని లాక్కోకపోవడమే న్యాయం.  థామస్ హాబ్స్
@దండన విధించకపోతే బలవంతులు బలహీనులను మింగి వేయడం అనే చిన్నచేపను పెద్ద చేప మింగే న్యాయం జరుగుతుంది. 
@నీతి, న్యాయం, ధర్మం అనుసరించేవారు నిర్భయంగా జీవిస్తారు.
@న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే.  అయితే గెలిచిందంతా న్యాయం కాదు .  శ్రీ శ్రీ
@న్యాయం చేయడంలో ఆలస్యం జరగడమంటే అన్యాయం చేయడంతో సమానమే. వాల్టర్ లాండర్
@న్యాయం, ధర్మం  ఆలోచించి పనిచేయువాడు పొరపాట్లు చేయలేడు.
@సత్యమే ధర్మం, సత్యమే న్యాయం.

కామెంట్‌లు