గీతా వాణి: ఓమితి ఏకాక్షరం బ్రహ్మ!"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌"ఓం"కారమే శివము!
   
       ఏకైకము, ప్రణవము!
       పరంబ్రహ్మ రూపము!
           ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"ఓం"కారము.. ప్రణవాక్షరి! పరమ పవిత్రమైనది. ఓంకార రూపుడు.. సచ్చిదానంద మయు డైన సాంబశివ పరం బ్రహ్మము!
 👍"ఓం కారము"... "తారక" మంత్రము! "తారక" నామ ధేయుడు... పరమేశ్వరుడు!
🚩"ఓం"కారము.. అక్షర విభూతిలో అగ్రగణ్య మైనది! దివ్య లీలా విభూతులతో విలసిల్లువాడు.. పరమేశ్వరుడు!
👌"ఓం"కారము.. అకార.. ఉకార.. మకారము.. లనెడు; మూడు వర్ణములు కలది. బ్రహ్మ, విష్ణు, రుద్రు లనెడు; మూడు మూర్తులతో విరాజిల్లువాడు.. పరమేశ్వరుడు! 
👌"ఓం"కారము, మరియు, "అథ" శబ్దములు.. శుభ మంగళ వాచకములు! సర్వ మంగళుడు, శుభంకరుడు... "పరమేశ్వరుడు" ఒక్కడే!
🚩అక్షరబ్రహ్మ స్వరూప మైన, "ఓం"కారమును ఉచ్చరించుచు; ఎవరు నన్ను.. ప్రణవార్ధ స్వరూపునిగా, పరమేశ్వరునిగా స్మరించుచు; పాంచ భౌతికమైన దేహమును విడిచిపెట్టు చున్నారో; వారు (ఆరాధకులు, సాధకులు..) ఉత్తమమైన గతిని (శ్రీ కైవల్య పదమును) చేరుకొను చున్నారు!అని, గీతా చార్యుడు "సాధనా మర్మమును" విశదీకరించారు!
🚩 "ఓమితి ఏకాక్షరం బ్రహ్మ" అని, గీతా సందేశం! ఇది..(8) అక్షర పరంబ్రహ్మ యోగము.. 13.వ. శ్లోకము
  🙏గీతా సందేశం
       ( తేట గీతి )
       "అథ" పరంబ్రహ్మ వాచకం బైన యట్టి
       "ఓం"యనెడు ఒక్క అక్షర ముచ్చరించి, 
        ఆత్మ నన్నెంచి, మెయి వీడి, అరుగువాడు,
        ఉత్తమంబైన మోక్షంబు పొందగలడు!
( 'కవి శేఖర', శ్రీ అబ్బరాజు హనుమంత రాయ శర్మ. ) 

కామెంట్‌లు