సింగమల అనే అడవిని
మంచి నైపుణ్యంతోని
కంఠీ అనే సింహం...
పాలించెదా అడవిని
దానికి మౌకలి ఒకటి
నక్క కూడానొక్కటి
అనుచరులుగా ఉంటూ...
సాయపడువొకటికొకటి
ఎగురుకుంటు కాకి వచ్చి
కబురునొకటి పట్టుకొచ్చి
ఒకరోజు కాకి చెప్పె.....
సింగరాజు చెంతకొచ్చి
ఈ అడవికి దూరాన
ఉన్నా ఎడారిలోన
ఒంటెనొకటి ఉన్నది...
దానినే వేటాడిన
వారం రోజుల పాటు
తిండికి ఉండదు లోటు
సింహం,నక్కకు చెప్పి
బయలు దేరినవి అటు
ఎడారిలోకి పోగానె
అడుగులందు వేయగానె
వేడికి వాటి కాళ్ళు........
చుర్రుమంటు కాలగానె
నడువలేకను పోయాయి
అక్కడే నిలబడినాయి
మిత్రమా! కావుమనుచు
కాకి ఒంటె నడిగె పోయి
మా రాజు సింహంని
మా మంత్రగు నక్కని
అడవిలోన దింపమని
అడిగినాది ఒంటెని
ఒంటనే ఒప్పుకొనెను
అడవిలో దింపుతాను
అని వాట్ని మోసుకొచ్చి
చేర్చె స్థావరంలోను
ఒంటె యొక్క మంచి తనము
మెచ్చినాది ఆ సింహము
మిత్రమా నీవు కూడా....
మాతో పాటే ఉండుము
అని సింహం వేడినాది
ఒంటెను ఒప్పించి నాది
కాదనక ఒంటె అపుడు...
అక్కడే ఉండి నాది
ఈ నిర్ణయం నక్కకీ
ఈ నిర్ణయం కాకికీ
ఏ మాత్రం నచ్చలేదు...
ఆ రెండు జంతువులకీ
ఉపాయాన్ని పన్నినాయి
రాజు చెంత చేరినాయి
మీరెక్కడికెళ్ళలేరు.....
మీ కాళ్ళును కాలినాయి
మమ్మల్ని మీరు తినండి
మీ ఆకలి తీర్చుకోండి
అడవికి రాజైన మీరు...
తిని అడవిని కాపాడండి
ఆ మాటలు ఒంటె వినెను
సింహం ముందుకు వెళ్ళెను
మూడు రోజుల పాటూ......
మీకు సరిపోగలననెను
ఆ మాటల కొఱకేను
ఆరెండెదురు చూసెను
ఒంటె మాటలు వినగానె
ఎంతో సంబుర పడెను
సింహమంతా గనెను
నాటకమని తలచెను
సరె ఒక్కొక్కరు వరుసగ
మీరు నిలబడుమనెను
చిన్న జీవితో నేను
మొదలిడి తింటాననెను
ముందు కాకిని రమ్మంటు
సింహమప్పుడు పిలిచెను
ఆ మాటలనగాను
కాకి ఎగిరి పోయెను
నంగ నాచి నక్క బావ
పరుగు తీసి వెళ్ళెను
ఒంటెతో చెలిమి చేసి
సింహం చేర దీసి
రెండు కలిసి ఉండెను
కపటము పారదోసి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి