సహకారం;:దోసపాటి వెంకటరామచంద్రరావు.
సాహీతీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ:సున్నితం
రూపకర్త:ఎన్.సునీత
=====================
1.ఒకరికొకరు చేసుకోవారలి సహకారం
సహకారం ఎంతో సహాయం
సహాయానికి కావాలి సహృదయం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

2.నువ్వునాకు నేనునీకు సహాయం
సహాయం చేస్తూ సహజీవనం
సహజీవనం ఎంతో ఆదర్శం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

3.మనిషికి మనిషికి సంబంధం
సంబంధముంటేనే ఎంతో సహకారం
సహకారమంటేనే చాలా ఉపయోగం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

4.దేశాలు చేసుకొనును సహకారం
సహకారం చేస్తేనే సమన్వయం
సమన్వయం అంటేనే సహగమనం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

5.నీకుకొంత నాకుకొంత సహభాగం
సహభాగం కావాలి సమానం
సమానమైతేనే కూడును సన్నితత్వం
చూడుచక్కని తెలుగు సున్నితంబు.


కామెంట్‌లు