అక్షరం -ఆయుధం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

  కవి మూడో కన్ను!
  అతని చేతి పెన్నుగన్!
  అతని కలం కరవాలమే!
  కష్టజీవి కి కుడి,ఎడమ,
      ఉండేది కవే కదా!
 అందుకే అతన్ని,
                  ఆదుకుంటాడు!
  పెన్ గన్ చేస్తాడు,
              అక్షరాలగుళ్ళతో!
   సరి గురి చూస్తాడు
   రాతల్ని మారు‌స్తాడు!
 కవి వీర్యం శౌర్య మవుతుంది!
  సర్దుబాటు, దిద్దుబాటు,
                 పొసగనపుడు!
   తిరుగుబాటే బాటవుతుంది!
ఆలోచనలు అగ్నిహోత్రాలే!
అక్షరాలు అగ్నిగోళాలే!
పోరాటం కర్తవ్యం అన్నపుడు!
 ఆయుధం ధరించక తప్పదు!
 పోరాటాన విజయం రాజ్యం!
 పరాజయం వీరస్వర్గం!
  ఉభయమూ కుశలమే!
  బానిసత్వజీవితం కన్న,
    స్వొతంత్ర్య పోరాటం మిన్న!
 అలుపెరుగని పోరాటమే,
      స్వాతంత్ర్యం తెచ్చిందిగా!
"ఆజాదీ కా అమృతోత్సవం"
 ఘనంగా జరుపుకుంటున్నాం!
  అమరవీరులెందరో,
     వారందరినీ స్మరిస్తున్నాం!
  సంధి పొసగనపుడు,
               .సుమరం తప్పదు!
  మన భారతాన,
         మహాభారతం సాక్ష్యం!
 మన జీవితం,
               సమాజం కోసం!
  ప్రగతి దారిలో పోరాటపటిమ,
        అనుక్షణం అవసరం!
  కవి సిపాయి కావాలి!
   కవిత్వం రాయాలి,
              యద్ధమూ చేయాలి!

కామెంట్‌లు
రామానుజం చెప్పారు…
అక్షరానికి వుండే శక్తి అంతర్లీనం . మేధా శక్తి ఆవిష్కృతం.