*** 34 ****
********
వ్యాపారం లో దివాళా తీసేసిన ఇస్మాయిల్ సాయిబు... మేము భోగబందా కని ఇచ్చిననాలుగు
వేల రూపాయల పెట్టుబడితో
వ్యాపారంలో మంచి లాభాలు పొంది ఆర్ధికంగా స్థిరపడిపో యారు...!
మాకిచ్చిన పూరింటిని...బిల్డింగ్ చేస్తానని... 15 వేలిస్తే భోగబం దాకు మేమేఉండొచ్చనిచెప్పటం తో...అందుకు మేముఅంగీకరిం చటం...పురిOటి స్థానంలో లెట్రిన్ బాత్రూం లతో సహా... మంచి స్లేపు ఇల్లు తయారవటం అందులోనే మేముండటం... !
మట్టినేల, పూరిళ్లలో ఉంటూ...
ఎండైనా, వానైనా... వీధి చివర సామూహిక మరుగుదొడ్లకు వెళుతూఇబ్బందులుపడేటోల్లం
ఇప్పుడు ఏ ఇబ్బందులూ లేని ఇంటిలో... ! వంటకోసం...
పొలాల్లో ఎండు పుల్లలు, కంపలు సేకరించి తెచ్చుకునే వాళ్ళం...గ్యాస్ పొయ్యి తో...
కాస్త మెరుగైన బ్రతుకునిచ్చిన ఆ పరమాత్మకు కృతజ్ఞతాభి వందనములు తెలుపుకుంటూ
ఓవైపు...స్టూడియోసమస్యలతో సతమత మవుతుంటే....
బరంపురం వారుమాచిన్నచెల్లికి
బొట్టుపెట్టి వెళ్లిన తరువాత...
మా చిన్నచెల్లిని... ఎన్నిమందులు వేసినా... ఎందరు డాక్టర్ల దగ్గరకు తిప్పినా తగ్గని జ్వరం పట్టుకుని తనని జీవచ్ఛవంగా మార్చేసింది... !
ఆఖరిప్రయత్నంగావిశాఖపట్నం
తీసుకువెళ్లాం... అక్కడ డాక్టర్ ప్రసాద్ లాల్ కార్డియాలజిస్ట్ దగ్గరకు వెల్లటం... ఆయన
ఓ ప్రైవేట్హాస్పిటల్ లో జాయిన్
చేయించి ట్రీట్మెంట్ మొదలు పెట్టటం........ !
టెస్టులు చేయించారు, ఆయన వాడమOటున్న టాబిలెట్లన్నీ మేమువాడేసినవే...నేనావిషయాన్ని చెబుతుండటం తో...
ఆఖరి ప్రయత్నంగా చేతిమీద
టీ బీ కి సంబంధించిన టీకా వే యించటం... అది టీ బీ గా తేలటంతో... ఆర్సినెక్స్ , మైకోబు టాల్ కేవలంరెండేటాబిలెట్లతో రెండు రోజుల్లో ఆరోగ్యంలో మెరుగైన మార్పు ... !వార0 తరువాత రమ్మన్నారు.... !
వైజాగ్‌లో ట్రీట్మెంట్జరిగినన్నాళ్ళూ మాకు వసతి, భోజనాది సకల సౌకర్యాలూ.....
మా ఆపద్బాంధవులైన
మాపెద్ద చెల్లిగారింట్లోనే...!
ఒక్క చిన్నచెల్లి విషయంలోనే కాదు... మరోమారు... మా రెండోచెల్లి ... వాళ్ళాయన పెట్టేహింసలకు ఆరోగ్యం పాడై
రక్త హీనతతో రోగనిరోధక శక్తి ని కోల్పోయి... శరీరంపై పెద్ద పెద్ద గ్లాoడ్స్.......చావు, బ్రతులమధ్య ఉన్నపుడు... మా పెద్దచెల్లి వాళ్ళే ఆదుకుని .... తన రక్తా న్నిచ్చి సేవచేస్తే... బావ అంటే మావెంకటరావు మామయ్య...
అండ, దండగా ఉంటూ...
ఎంతో డబ్బు ఖర్చుపెట్టారు ... !
మంచితనం, సేవాభావం...
వాళ్ళలాంటి వాళ్ళను చూసే నాలాంటివారు.... నేర్చుకుంటారు... !
***-*-***
........... సశేషం .........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి