మనుషులు;-- యామిజాల జగదీశ్
మనుషులు
పలు రకాలు

అయోమయాలూ
ఆందోళనపరులూ

కలవరపరిచేవారూ
కలతపడే వారూ

మూర్ఖులూ
మూతి బిగించిన వారూ

తెలివైనవారూ
తెలివితక్కువవారూ

స్వార్థపరులూ
నిస్వార్థపరులూ

ప్రశాంత మనస్కులూ
పరుగులు పెట్టించేవారూ

అహంకారులూ
నిరహంకారులూ

నిండు మనసుతో 
ప్రశంసిచేవారూ
నిందలతో నడిచేవారూ

మోసగాళ్ళూ
నిజాయితీపరులూ

సలహాలిచ్చేవారూ
సూచనలు చేసేవారూ

నవ్వులు పంచేవారూ
కన్నీళ్ళు మిగిల్చేవారూ

ఆనందమయులూ
ఆవేదన వదలని వారూ

క్షణాలలో చేసేసేవారూ
ఎన్నాళ్ళకైనా చేయని వారూ

మాట తప్పిన వారూ
మాటలో మాటతో మడికట్టుకున్న వారూ

కోపిష్టులూ
శాంతస్వభావులూ

ఒక్కొక్కరినీ చదివితే 
ఇందరి మధ్య మనమున్నామా
లేక అన్ని గుణాలూ
మనలోనే 
మన చూపులలోనే
కలిసున్నాయా
ఇందరిని చదవడానికి
ఈ స్వల్ప జీవితం సరిపోయేనాకామెంట్‌లు