అంత్యప్రాస గజల్ ;- సోంపాక సీత భద్రాచలం639311050
ఆచార్యుని సన్నిధియే.. సత్వగుణమని తెలిసికొమ్ము
సాధనలో నువ్వేగా.. అగ్రగామివి కదలిరమ్ము

తూరుపుదిశ తెలవారెను.. బద్ధకమును తుంచివెయ్యి
మనదిఅనే మంత్రంతో.. మనీషిగా వెలిగిపొమ్ము..

నలుగురితో నడయాడే.. తావేగా బృందావని
మమకారపు మూలదినుసు.. సంపదగా ఎంచుకొమ్ము..

చీకటితెర తొలగిపోయి.. వెలుగురేఖ పొడచూపెను
మనసుకొలను తడిదీరగ.. శ్రీవాక్కైతరలిరమ్ము..

పరమాత్మ ఆరాధన.. అజ్ఞానమును పారద్రోలు
నిజతత్వమే సాధనగా.. సిరి'సీతా' నిలిచిపొమ్ము..

         

కామెంట్‌లు
Unknown చెప్పారు…
నిజతత్వమే సాధనగా-*సిరి*సీతా
నిలిచిపొమ్ము👌👌💐💐💐💐