1.
రారండోయ్ రారండి
బడికి వెల్దాo రారండి
ఆడుకుందాం రారండి
చదువుకుందాం రారండి
2.
గుండెలోన ఈ ఆశ
మనిషి బతుకు మీదఆశ
ఉండాలి పెద్ద ఆశ
చెందబోకు నిరాశ
3.
నన్ను నేను వెతుకుతున్న
ఇష్టంతో బతుకుతున్న
నన్ను నేను తెలుసుకున్న
అదే నేను అనుకున్న
4.
స్నేహానికి కులం లేదు
నెయ్యానికి మతం లేదు
అడ్డుగోడసలే లేదు
అందరిలోనా కలదు
5.
ఉషోదయం తూర్పునా
అమ్మ ముఖం చూసినా
ఆనందం మనసునా
ఉత్సాహo పొంగెనా
6.
అనురాగం పంచు అమ్మ
ఆత్మాభిమానం అమ్మ
ఇష్టమైన పలుకు అమ్మ
ఉన్నతమైనది అమ్మ
7.
చెరువులోన పువ్వులు
మా ఇంట్లో నవ్వులు
అందమైన పిల్లలు
మనసు దోచే మల్లెలు
8.
ఘనమైన తెలంగాణను
పడగొట్టిరి దొరలను
చూపిరి త్యాగాలను
నిలిచిరి చరితలోను
9.
అందమైన పల్లెటూరు
పచనైన మా ఊరు
కల్మషమే ఎరుగరు
చిరునవ్వుల సెలయేరు
10.
తప్పును కప్పుకోను
గొప్పలు చెప్పుకోను
మధ్య గొడవలు పెట్టను
స్నేహంగా ఉంటాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి