అంత్యప్రాస గజల్;- సోంపాక సీత--భద్రాచలం 8639311050
గెలుపుబాట దారులలో కదలాలిర సోదరా
ఆటంకపు కంచెనువ్వు దాటాలిర సోదరా!

కార్పొరేట్ విద్యనేమో మక్కువతో చదివేరు
వీధిబడులె విజయాలకు సాక్ష్యాలని తెలవాలిర సోదరా!

స్వదేశీ విధానమే చద్దన్నము మూటరా
పాశ్చాత్యపు పద్ధతులను తెగడాలిర సోదరా!

అమ్మభాష అందించే సంస్కారము అమూల్యం
రసహీనపు మెరుగులన్ని విడవాలిర సోదరా!

తెలుగుభాష ఒడిలోనేధరణి'సీత' 
పవళించు
సునామీల పయనాలను వదలాలిర సోదరా!

                

కామెంట్‌లు
Unknown చెప్పారు…
సందేశాత్మక గజల్👌👌💐💐💐
సీత గారూ