గజల్ :-;-మమత ఐలకరీంనగర్9247593432
జగమంతా జనులైతే మానవతకు కొదవలేదు
వనమంతా పూలైతే చెడుపవనం వీచలేదు

ఎదుగుతున్న జాతినంత పదిలపరచ లేనిజనం
మటుమాయం జేసేందుకు సుందరముగ వీచెగుణం

చూడలేని కళ్ళకెపుడు చుక్కపొద్దు చక్కదనం 
మారనట్టి మూలాలకు గులకరాయి మణిరత్నం

లేని కాంతి విరజిమ్మే కల్మషాల దురాగతం
వింత వింత అగంతాలు సృష్టించే మలిన తనం

ఆపలేని సైయ్యాటకు అడ్డుకట్ట మమతగుణం
సాగిపోవు సెలయేరై పీల్చదుఏచెడు విహరం


కామెంట్‌లు