ఆరు గంటలు;-..కనుమ ఎల్లారెడ్డి-93915 23027

 .కిరణ్ అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు.తీరా పరీక్షలు దగ్గరకు వచ్చే కొద్దీ చదవలేక ఏడుస్తూ కూర్చున్నాడు.రాము అతని పరిస్థితి గమనించి " ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం.రోజు స్కూలుకు రాకుండా ఆటలతో గడిపావు.నీ తల్లిదండ్రులను మోసం చేశావు " అన్నాడు. " అవును రాము ఇప్పుడు ఎలా ?నాది తప్పే.పరీక్షలు ఇక నెల లో ఉన్నాయి.ఏదైనా ఉపాయం చెప్పరా " అని అడిగాడు. రాము నవ్వి "చదువులో ఉపాయాలు ఏవి ఉండవురా. మన శ్రద్ధ, ఇప్పటికయినా రోజు ఆరు గంటల చదువు.అర్ధం కాకపోతే అడుగు " అన్నాడు." సరే రా నువ్వు చెప్పినట్లు చేస్తాను. రోజు ఆరు గంటలు చదువుతాను " అన్నాడు.రాముచెప్పి నట్లు శ్రద్ధగా చదివాడు.పరీక్షల లో ఇద్దరూ విజయం సాధించారు.అప్పటినుంచి చక్కగా
స్కూలుకు వస్తూ శ్రద్ధగా పాఠాలు విని రోజు ఆరు గంటలు చదివే వాడు.వాడిలో వచ్చిన మార్పుకు సంతోషించాడు రాము.

కామెంట్‌లు