కొత్త సంవత్సరం;-....కనుమ ఎల్లారెడ్డి.పౌరశాస్త్ర అధ్యాపకులు,93915 23027

 సిద్ధు అల్లరి,చిల్లర గా తిరుగుతూ పాఠశాలకు
సక్రమంగా వెళ్ళే వాడు కాదు.ఎప్పుడు సెల్ లో ఆటలు,సినిమాలు చూస్తూ పాఠశాల ఎగ్గొట్టే వాడు.సంవత్సరాలు గడుస్తున్న వాడిలో మార్పు రాలేదు.పదవ తరగతి కరోన తో పాస్
అయ్యాడు.కాలేజి కి జాయిన్ అయిన రోజు వెళ్ళాడు.ఇంతవరకు మళ్ళీ వెళ్ళనే లేదు. వాళ్ళ ఇంటి ప్రక్కనే  కొత్తగా చేరారు రమేష్ దంపతులు. సిద్ధు వెళ్ళే కాలేజీ లో అతను లెక్చరర్. రోజు కాలేజీ కి రాకుండ ఉండటం చూసి రమేష్  ,సిద్ధుని పిలిచి " "నువ్వు సరిగ్గ
కాలేజీ కి రావడం లేదు.ఉదయమే కాలేజీ టైం కు వెళ్ళతావు, ఎక్కడ ఉంటున్నావ్, అలా తిరిగితే అమ్మ,నాన్న ఎంత భాద పడతారు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావ్, నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావ్. కనీసం ఈ కొత్త సంవత్సరం లో నైనా నీ పద్ధతి మార్చుకో.కాలేజి కి క్రమంగా రా మంచి భవిష్యత్తు ఉంటుంది " అని చెప్పాడు.
ఆ మాటలకు సిద్ధు లో మార్పు కలిగింది.నిజమే ఇంతవరకు  అల్లరిగా తిరిగాను.కొత్త సంవత్సరం లో మంచి నిర్ణయం
తీసుకుంటాను అనుకున్నాడు.ఆ రోజు రమేష్ సార్ దగ్గరకు వెళ్ళి " గుడ్ మార్నింగ్ సార్ ,ఈరోజు నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి నేను మారాను సార్. కాలేజి కి సక్రమంగా వస్తాను " అని గురువుకు పాదాభివందనం చేశాడు. వాడిలో వచ్చిన మార్పుకు సంతోషించి ఆశీర్వదించాడు రమేష్.

కామెంట్‌లు