1.యుగాలు మారుతున్నా ,
అన్యజీవుల లక్షణాలవే!
పరిణామక్రమంలో,
మనిషికి ఏ లక్షణాలో?
మనిషికి ఎన్నో ఉన్నాయి,
మనిషి (మంచి)తనం తప్ప!
పిచ్చి కు(ము)దిరిందో!
తలకి రోకలి చుట్టాడు!
2.ఎప్పటికీ కుందేలు కుందేలే,
పులి పులే!
మనిషి ఎప్పుడు కుందేలో,
పులో ప్రశ్నార్థకం!
నేడు మనిషి మనిషిగా,
ఉన్నాడంటే ఆశ్చర్యార్థకం
మనిషికి అపాయంమనిషితోనే,
అన్న ది ఓ నిశ్చితార్థం!
3.నాగరికతా వికాసం,
సమాంతరంగా మానవతా,
వినాశం!
భూమి పొరలు చీల్చే బోర్లు,
సాగరాలు మురికికి దార్లు!
గాలి నిండా కాలుష్యం,
నిప్పుకి చెదపట్టిన వైనం!
ఆకాశమార్గాన ఆగని,
సాయుధపోరాటం!
4.నేడు మనిషి రుద్ర రూపం,
చేసేది వింత తర్కం!
బతకడమంటే ఇతరులను,
దోచుకోవడం, దాచుకోవడం!
మేల్ తలపు మచ్చుకైనా లేదు,
కీడు పెద్ద మచ్చ ఏమీ కాదు!
పొరుగు వారు బాగుంటే,
చూడడం వీడి వల్ల కాదు!
5.ఓ నాడు మరా,మరా అంటే,
రామే, నేడు మరి మరే!
మనిషి రోబోట్,
బ్రూట్,బ్రూటస్!
ఆది లో మనిషి ఆటవికుడే,
వంచకుడు మాత్రం
కాదు!
ఆధునికాన చిక్కని,
దొరకని దేవాంతకుడే!
మనిషి (మంచి) తనం,
తెరమరుగు, పతనానికి,
ముందడుగు!
----------------------------------------
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
అన్యజీవుల లక్షణాలవే!
పరిణామక్రమంలో,
మనిషికి ఏ లక్షణాలో?
మనిషికి ఎన్నో ఉన్నాయి,
మనిషి (మంచి)తనం తప్ప!
పిచ్చి కు(ము)దిరిందో!
తలకి రోకలి చుట్టాడు!
2.ఎప్పటికీ కుందేలు కుందేలే,
పులి పులే!
మనిషి ఎప్పుడు కుందేలో,
పులో ప్రశ్నార్థకం!
నేడు మనిషి మనిషిగా,
ఉన్నాడంటే ఆశ్చర్యార్థకం
మనిషికి అపాయంమనిషితోనే,
అన్న ది ఓ నిశ్చితార్థం!
3.నాగరికతా వికాసం,
సమాంతరంగా మానవతా,
వినాశం!
భూమి పొరలు చీల్చే బోర్లు,
సాగరాలు మురికికి దార్లు!
గాలి నిండా కాలుష్యం,
నిప్పుకి చెదపట్టిన వైనం!
ఆకాశమార్గాన ఆగని,
సాయుధపోరాటం!
4.నేడు మనిషి రుద్ర రూపం,
చేసేది వింత తర్కం!
బతకడమంటే ఇతరులను,
దోచుకోవడం, దాచుకోవడం!
మేల్ తలపు మచ్చుకైనా లేదు,
కీడు పెద్ద మచ్చ ఏమీ కాదు!
పొరుగు వారు బాగుంటే,
చూడడం వీడి వల్ల కాదు!
5.ఓ నాడు మరా,మరా అంటే,
రామే, నేడు మరి మరే!
మనిషి రోబోట్,
బ్రూట్,బ్రూటస్!
ఆది లో మనిషి ఆటవికుడే,
వంచకుడు మాత్రం
కాదు!
ఆధునికాన చిక్కని,
దొరకని దేవాంతకుడే!
మనిషి (మంచి) తనం,
తెరమరుగు, పతనానికి,
ముందడుగు!
----------------------------------------
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి