వచ్చింది వచ్చింది వచ్చింది
అక్షర సంక్రాంతి వచ్చింది
తెచ్చింది తెచ్చింది తెచ్చింది
లక్షల వరాలనే అది తెచ్చింది !
వచ్చిన అక్షర సంక్రాంతి
మెచ్చిన లక్షల విక్రాంతి
అందరికీ ఎంతో నచ్చింది
సుందర సుమాలనిచ్చింది !
వినవమ్మా ఓ మా చెల్లెమ్మా
కనవమ్మా ఇక ఇల నీవమ్మా
నువ్వు అక్షరాలనే నేర్వాలమ్మ
ఆ లక్ష వివరాలను పొందాలమ్మ !
వింటేను కంటేను మా చెల్లెమ్మ
అక్షరాలే మన ఆయుధాలమ్మ
ముందుకు నీవు రావాలమ్మా
అక్షర విందులు చేయాలమ్మా !
చిన్నారి పొన్నారి చిట్టెమ్మ
పలకా బలపం పట్టాలమ్మ
అదురు బెదురూ లేకుండా
చదువుసంధ్యలు నేర్వాలమ్మ !
సిగ్గు శరము నీకు వద్దమ్మా
అక్షర శరమే ఇక ముద్దమ్మా
చదువుల గంట మోగించు
పదవుల పంటను పండించు !
ఆదిశక్తివి నీవమ్మా చెల్లెమ్మ
మా మాటను నీవు వినవమ్మా
పూతోటలోని ముద్దుల కొమ్మా !
మూఢనమ్మకాల నమ్మొధ్ధమ్మ
విద్యనిగూఢ విత్తమని నమ్మమ్మ
కనుగొంటే కనుగొంటే ఈ వింత
లేనేలేదిక ఇల నీకు చీకూచింత !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి