గీతా వాణి:మానసిక తపస్సు!"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌చిత్త నిర్మలత్వము,
      సౌమ్యత్వము, మౌనము,
      మానసిక మగు తపము!
                ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌సాధకుల మనస్సు, ఎల్లపుడు ఆనందంగా, ప్రశాంతముగా, నిర్మలముగా, నిష్కల్మషముగా ఉండాలి! మనస్సు.. పరిశుద్ధమై, ప్రసన్నముగా సంతోషముగా నుండాలి. 
👌సాధకులు భక్తి జ్ఞాన వైరాగ్యములచే  మనో మాలిన్యమును తొలగించుకోవాలి. ఆవిధముగా చిత్తమును నిర్మలత్వముగా నుండడమే.. "మనః ప్రసాదం"! అంతఃకరణ  ప్రవృత్తి.. శాంత స్వభావము కలిగి యుండడమే.."సౌమ్యత్వము"! మనస్సు.. నిరంతరము పరమేశ్వరుని యొక్క నామ రూప, గుణ తత్త్వ, లీలలను చింతనము చేయడం! అట్లే, పరంబ్రహ్మ తత్వ విచారణ కావించడమే.. "మౌనము"!
👌"మనస్సు ప్రసన్నత, శాంత స్వభావము, మౌన ముద్ర, మనో నిగ్రహము, అంతఃకరణ శుద్ధి.. అనునవి; మానసిక తపస్సు!" అని, కృష్ణ భగవానుడు పేర్కొను చున్నాడు.
🚩"మనః ప్రసాదః సౌమ్యత్వం!" అని, ( అధ్యాయం.17 శ్రద్ధాత్రయ విభాగ యోగం.. 16.వ. శ్లోక రత్నం నందు ) గీతాచార్యుని సందేశము!
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      సౌమ్య భావమ్ము, హృదయ ప్రసన్నతయును,
       భావ సంశుద్ధియును, మౌన భావ,మాత్మ
         నిగ్రహము, మున్నుగా గల నిరుపమాన
          విషయములు మానసిక తపో విధి జెలంగు!!
      ( గీతా సప్తశతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )      

కామెంట్‌లు