ఈ అక్షర బాలగేయం;-మచ్చ అనురాధసిద్దిపేట9948653223.
ఈత చెట్టు చూడరా
ఈదర గాలి వీచురా
ఈత పండ్లు రాలురా
ఈత  పండ్లు తీపి రా

ఈలలు వేస్తూ రండిరా
ఈసడించు కోకుమురా
ఈర్ష్యా ద్వేషం వీడుమురా
ఈతకు ఒంటిగవెళ్ళకురా

ఈకలు పక్షులకందమురా
ఈడు వారితో ఆడుముర
ఈప్సిత పనులు చేయుమురా
ఈనాములను  పొందుమురా

ఈశుని పూజించుము రా
ఈశ్వరిని సేవించుమురా
ఈ గుణములు పెంచురా
ఈ జగతికి ఆదర్శమురాకామెంట్‌లు